తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఆనాటి త్యాగాలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా అమరుల వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సిపిఐ మండల కార్యదర్శి చిల్లం చర్ల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగాల మండల పరాగణలో 33 మంది తెలంగాణ సాయుధ పోరాట అమర యోధులు అమరులయ్యారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతు బిడ్డల ధైర్యం కమ్యూనిస్టు నాయకుల నాయకత్వం పోరాటం దేశానికి మంచి చరిత్రను ఇచ్చిందన్నారు. రాజ్యాధికారానికి వ్యతిరేకంగా దేశంలో జరిగిన తొలి సాయుధ పోరాటంగా రైతాంగ పోరాటం నిలిచిందన్నారు.జమీందారీ విధానం,బానిసత్వం, వెట్టి చాకిరి లేకుండా చేసింది కమ్యూనిస్టుల పోరాటమే అన్నారు. రజాకార్ల దురాగతాలను అడ్డుకొని దున్నేవాడికే భూమిపై హక్కును కల్పించింది,అణగారిన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వం వైపు మార్గాలు వేసింది ఆనాటి సాయిధ పోరాటయోధుల త్యాగాలతో కూడిన జీవితమేనన్న విషయం మరవరాదన్నారు. సాయుధ పోరాటం ఇచ్చిన స్ఫూర్తితో దేశంలో అనేక ఉద్యమాలు రావడంతో నేడు ప్రజలు స్వేచ్ఛ సమానత్వాలను పొందుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సారెడ్డి రాఘవరెడ్డి శ్రీనివాసు సిపిఎం నాయకులు బుర్రి శ్రీరాములు చందా చంద్రయ్య స్టాలిన్ రెడ్డి ఉప్పుల యుగంధర్ రెడ్డి కందిబండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాయిధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం...

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి