భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో
భువనగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభించారు.భువనగిరి పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ను మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో నాణ్యమైన వస్త్రాలు,ఇతర వస్తువుల కోసం ప్రజలు హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని, అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలు,నూతన మోడల్స్ ఇక్కడే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ షాపింగ్ మాల్ రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని,అలాగే సామాన్య,మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలోనే నాణ్యమైన వస్తువులు లభిస్తాయని తెలిపారు. వ్యాపారులు కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన సేవలు అందించాలని కోరారు. నూతన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్,18వ వార్డు కౌన్సిలర్ పాశం అమరేందర్,కాంగ్రెస్ నాయకులు కూర శివకుమార్,మహమ్మద్ రఫీ ఉద్దీన్,గౌరీ,గుమ్మడెల్లి రమేష్,రాజు,చౌదరి బ్రదర్స్ వస్త్ర యాజమాన్యం,స్థానిక ప్రజలు,వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి