రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాలు రెపరెపలాడాయి. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లాల్‌బహదూర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో రాములు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఏపీవో వెంకన్న, మహిళా సంఘం భవనం వద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల మౌనిక, సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ కార్యాలయం వద్ద ఎస్‌ఐ గోపతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిసి జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా కార్యాలయాల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి