జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. చారిత్రక సంఘటనల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు.
PRINT TIME: September 17, 2026 02:31 PM
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం

17-09-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. చారిత్రక సంఘటనల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి