రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో పెన్షన్ దరఖాస్తుల పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియను ఎంపీడీవో ఆవుల రాములు పర్యవేక్షించారు. దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి వివరాలను చేయూత యాప్‌లో నమోదు చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరోజ, పంచాయతీ కార్యదర్శి అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి