జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్
చిట్యాల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం లభించేందుకు కృషి చేసిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
. అనంతరం బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్నగౌడ్, జయవరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు గోషిక వెంకటేష్, కంచర్ల శంకర్‌రెడ్డి, పాల రవివర్మ, దొడ్డు భాగ్యమ్మ, మల్లారెడ్డి, జోగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి