Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 06:58 PM

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సహాయ పరికరాలు

17-09-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన దినోత్సవాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రజాపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు.తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రీన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సంగారెడ్డి వారి సహకారంతో సుమారు రూ.13.10 లక్షల విలువైన 21 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను దివ్యాంగులకు అందజేశారు.ఈ పరికరాలు దివ్యాంగులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సహాయ పరికరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News