మునిపంపులలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు.. మొక్కలు నాటిన నేతలు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మునిపంపుల గ్రామంలోని శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు కనెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలని, దేశం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం నాయకులు మొక్కలు నాటారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, యాదాసు లక్ష్మణ్, మామిండ్ల కృష్ణ, కొమిరి తిరుమలేష్, బూడిద కిరణ్, కర్నాటి నరేష్, పాలాల శేఖర్, పున్న శ్రీకాంత్, సూరపల్లి వీరేందర్, బూడిద ఉదయ్, తంగళ్లపల్లి నందకిశోర్, కూరెళ్ల రామకృష్ణ, కర్నాటి రాము, గాడె స్వామి, గాడె అశోక్, చరణ్‌సాయి, మామిండ్ల నాగమ్మ, బూడిద నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి