Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 06:58 PM

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజా పాలనను బలోపేతం చేయాలి

17-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను, నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి కోసం సాగిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన, స్వేచ్ఛ కోసం ఎంతోమంది చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పన, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, మార్కెట్‌ కార్యదర్శి యండి ఫసియోదీన్‌ ముక్రం, మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది, డైరెక్టర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజా పాలనను బలోపేతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News