జాతీయ సమైక్యతకు సంకేతం గణేష్ ఉత్సవాలు: డిజీఎం వెంకటరమణారెడ్డి
వినాయక చవితి పండగను పురస్కరించుకుని పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో శుక్రవారం గణపతి హోమం, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ విద్యాసంస్థల డిజీఎం వెంకటరమణారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజలందరినీ ఏకం చేసి, పోరాట పటిమను పెంచేందుకు లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాడు తిలక్ నాటిన ఆ సమైక్యతా బీజమే నేడు దేశమంతటా మహా ఉత్సవంగా వికసించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఉత్సవాలు సంస్కృతీ సాంప్రదాయాలకు, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని 'సర్వేజనా సుఖినోభవంతు' అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ నవనీత, దివ్య, నరేష్, కోఆర్డినేటర్లు రవిశంకర్, సునీత, హర్ష, వైస్ ప్రిన్సిపాల్స్ హసీనా, క్రాంతి, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి