రాంనగర్, వినాయక నగర్, వెంకటరమణ కాలనీల్లో పర్యటన
స్వయంగా రంగంలోకి దిగి వరద కాలువల పూడికతీత
పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 13వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వార్డు పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన రాంనగర్, వినాయక నగర్, జయభూమి వెంచర్, వెంకటరమణ కాలనీలలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు.వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో తన వ్యక్తిగత సిబ్బందితో నిలిచిన వరద నీరు సాఫీగా ముందుకెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి కుప్పలు, చెత్తాచెదారాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వార్డు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలోనైనా తనను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి