Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 03:24 PM

గొర్రెల దొంగతనాల కేసులో కీలక మలుపు

గొర్రెల దొంగతనాల కేసులో కీలక మలుపు

గొర్రెల దొంగతనాల కేసులో కీలక మలుపు
19-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పోలీసుల తీరుపై బాధితుల ఆవేదన..

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో వరుసగా జరుగుతున్న గొర్రెలు, మేకల దొంగతనాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముదిగొండ, కొండబీమనపల్లి ప్రాంతాల్లో గొర్రెలను దొంగిలించి మారుతి ఎర్టిగా వాహనంలో తరలిస్తున్న నలుగురిలో ఒకరిని పోలీసులు వారం రోజుల క్రితం పట్టుకున్నట్లు సమాచారం.

మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

పట్టుబడిన నిందితుడిని విచారించగా దొంగిలించిన గొర్రెల ఆచూకీ లభించిందని, బాధితులు వాటిని గుర్తించినట్లు సమాచారం.

అయితే గొర్రెలను తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ప్రస్తుతం వాటిని నేరుగా ఇవ్వడం కుదరదని, డబ్బు రూపంలో సగం మొత్తం చెల్లిస్తామని చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారంలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంతో పాటు తమ గొర్రెలను పూర్తిగా తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Sthanikam

గొర్రెల దొంగతనాల కేసులో కీలక మలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News