Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:43 PM

నూతన ఎక్సైజ్‌ అధికారులకు ఘన సన్మానం

నూతన ఎక్సైజ్‌ అధికారులకు ఘన సన్మానం

నూతన ఎక్సైజ్‌ అధికారులకు ఘన సన్మానం
19-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిల్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఏడుకొండలు, ఎస్ ఐ అరుణ్‌కుమార్‌లను గీత కార్మికుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

గీత కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, కల్లుగీత సహకార సంఘాల సొసైటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా, పెన్షన్‌ తదితర ప్రయోజనాలు అందేలా చూడాలని సంఘం నాయకులు అధికారులను కోరారు. అలాగే బెల్ట్‌ షాపులను నియంత్రించడంతోపాటు కల్తీ మద్యం, కల్తీ కల్లును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై సీఐ ఏడుకొండలు స్పందిస్తూ.. కల్తీ మద్యం, కల్తీ కల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. గీత కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో గీత కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్‌గౌడ్, సొసైటీ ఉపాధ్యక్షులు, మండల నాయకులు లగ్గోని యాదయ్య, మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, సీనియర్‌ నాయకులు గంగాపురం యాదయ్య, సొసైటీ సభ్యులు చెరుకు శివరాజ్, నోముల వెంకటేశం, భూపతి నరసింహ, చెరుకు సత్యనారాయణ, వీరమల్ల లక్ష్మీనారాయణ, బండారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎక్సైజ్‌ అధికారులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News