Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:35 PM

అనాథ వృద్ధ మహిళకు ఆశ్రయం కల్పించిన జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి

19-09-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరువు మండల పరిషత్‌ దుకాణాల సముదాయం పక్కన నాలుగు రోజులుగా అనాథగా ఉంటున్న వృద్ధ మహిళకు జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి చొరవతో ఆశ్రయం లభించింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ మహిళను అక్కడ వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆమె పరిస్థితిని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు నాలుగు రోజులుగా భోజనం అందిస్తూ మానవత్వంతో ఆదుకుంటున్నారు. ఈ విషయం మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి వృద్ధ మహిళకు సురక్షితమైన ఆశ్రయం కల్పించాలని జిల్లా ఫీల్డ్‌ రెస్పాన్స్‌ అధికారి సతీష్‌ను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు సతీష్‌ కార్యాలయ సిబ్బందితో కలిసి వృద్ధ మహిళ వద్దకు చేరుకుని భోజనం అందించడంతో పాటు అవసరమైన దుస్తులు సమకూర్చారు. అనంతరం ఆమెను అమీన్పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్‌ వృద్ధుల ఆశ్రమానికి సురక్షితంగా తరలించి ఆశ్రయం కల్పించారు. వృద్ధ మహిళకు సకాలంలో స్పందించి అండగా నిలిచిన జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీణ, ప్రమీల, జబ్బర్, అల్తాఫ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అనాథ వృద్ధ మహిళకు ఆశ్రయం కల్పించిన జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News