Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

03-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు సహజ రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా అందించాలని, అవి శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేయడంతో పాటు తల్లి–శిశువు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయని, ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తల్లులను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఆర్డీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు సహజ రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా అందించాలని, అవి శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేయడంతో పాటు తల్లి–శిశువు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయని, ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తల్లులను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఆర్డీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News