Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత

03-08-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో చెక్కులు, రుణాల పంపిణీ

రూ. 40 లక్షల బీమా చెక్కు అందించిన ఆర్‌ఎమ్ ఉదయ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సోమవారం రుణాల పంపిణీ, బీమా చెక్కుల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. భువనగిరి రీజినల్ మేనేజర్ ఉదయ్ ముక్తాపురం లబ్ధిదారులకు వాహనాలను, బాధిత కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేశారు.అగ్రి యోజన పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక ట్రాక్టర్, రెండు అశోక్ లేలాండ్ మినీ వాహనాలను అందించినట్లు ఆర్‌ఎమ్ ఉదయ్ తెలిపారు. అలాగే, ఎస్‌బీఐ ప్రమాద బీమా పథకంలో రూ.2 వేల ప్రీమియం చెల్లించి దురదృష్టవశాత్తూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెక్కును అందజేశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి యోజన ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం శక్తి పథకం కింద మహిళలకు కోటి రూపాయలకు పైగా రుణాలు అందించిన ఏకైక శాఖగా చౌటుప్పల్ బ్రాంచ్ నిలిచిందని కొనియాడారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నామని, బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.​ఈ వేడుకలో చీఫ్ మేనేజర్లు సుదేష్ రెడ్డి, అన్వేష్, చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ మురళిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News