Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

ఎంబీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆగస్టు 5 వరకు గడువు.డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటన.

03-08-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఆగస్టు 3 (ప్రతినిధి): డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బ్రౌ) నిర్వహించే ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష (BRAOUCET) దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 5 చివరి తేదీగా నిర్ణయించినట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు.

విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లేదా ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే తెలంగాణ ఐసెట్ (TS ICET) లేదా బ్రౌసెట్ (BRAOUCET) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

బ్రౌసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని వివరించారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అపోలో హాస్పిటల్స్, కిమ్స్, డెక్కన్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం హాస్పిటల్, రెనోవో హాస్పిటల్ తదితర అనుబంధ సంస్థల్లో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయం నిర్వహించే జనరల్ ఎంబీఏ కోర్సులో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్షలో అర్హత తప్పనిసరని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాల కోసం 040-23680333, 040-23680555 నంబర్లను సంప్రదించాలని, లేదా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు

Sthanikam

ఎంబీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆగస్టు 5 వరకు గడువు.డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటన.

Article Image

హైదరాబాద్, ఆగస్టు 3 (ప్రతినిధి): డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బ్రౌ) నిర్వహించే ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష (BRAOUCET) దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 5 చివరి తేదీగా నిర్ణయించినట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు.

విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లేదా ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే తెలంగాణ ఐసెట్ (TS ICET) లేదా బ్రౌసెట్ (BRAOUCET) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

బ్రౌసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని వివరించారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అపోలో హాస్పిటల్స్, కిమ్స్, డెక్కన్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం హాస్పిటల్, రెనోవో హాస్పిటల్ తదితర అనుబంధ సంస్థల్లో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయం నిర్వహించే జనరల్ ఎంబీఏ కోర్సులో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్షలో అర్హత తప్పనిసరని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాల కోసం 040-23680333, 040-23680555 నంబర్లను సంప్రదించాలని, లేదా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News