Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:12 PM

సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.. దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ బిరాదర్ దత్తు

03-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలంలోని దోసపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్, మనూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిరాదర్ దత్తు అన్నారు. సోమవారం గ్రామంలోని శివాలయం ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని, ప్రజల సహకారంతో గ్రామంలో రహదారులు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు గ్రామానికి తీసుకువచ్చి దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ఏఈ రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శి బాలు, లింగం పటేల్, బసన్న, నారాయణ, అశోక్, కుశప్ప, అశోక్ డీలర్, సత్యనారాయణ, ఈరన్న, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.. దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ బిరాదర్ దత్తు

Article Image

మనూర్ మండలంలోని దోసపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్, మనూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిరాదర్ దత్తు అన్నారు. సోమవారం గ్రామంలోని శివాలయం ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని, ప్రజల సహకారంతో గ్రామంలో రహదారులు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు గ్రామానికి తీసుకువచ్చి దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ఏఈ రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శి బాలు, లింగం పటేల్, బసన్న, నారాయణ, అశోక్, కుశప్ప, అశోక్ డీలర్, సత్యనారాయణ, ఈరన్న, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News