Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ​ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

03-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా ఎరువుల కొరత, యాప్ ఆధారిత పంపిణీ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఐతరాజు అభయేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, పత్తి తదితర పంటలకు యూరియా అత్యవసరమైన తరుణంలో రైతులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. యాప్ ద్వారానే బుకింగ్ నిబంధన వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ​ప్రతి ఎరువుల దుకాణంలో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలి. ​యాప్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలోనూ ఎరువులు పంపిణీ చేయాలి.​క్యూ లైన్ల అవస్థలు తప్పించేందుకు గ్రామాల వారీగా లేదా టోకెన్ల ద్వారా అందించాలి. ​బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి బొట్ట శివ, నియోజకవర్గ అధ్యక్షుడు తగరం శుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ కోశాధికారి మాధ రమేష్, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల వెంకటయ్య, కత్తుల నర్సింహ, కురిమిద్ద యాదయ్య, ఖైతాపురం శివ, రైతులు మల్లయ్య, శివయ్య, అబ్బయ్య, ఈశ్వరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ​ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News