Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

సిరిపురానికి బీటీ రోడ్లు నిర్మించాలి. పెద్దకాపర్తి, వెలిమినేడు మార్గాల అభివృద్ధికి రాపోలు నరసింహా విజ్ఞప్తి.

03-08-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురం గ్రామానికి పెద్దకాపర్తి, వెలిమినేడు మార్గాల ద్వారా బీటీ రోడ్లు నిర్మించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ జాతీయ రహదారికి పెద్దకాపర్తి నుంచి 6 కిలోమీటర్లు, వెలిమినేడు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిపురం గ్రామానికి ఇప్పటికీ బీటీ రోడ్లు లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పెద్దకాపర్తి–సిరిపురం రహదారితో పాటు వెలిమినేడు–సిరిపురం–ఇంద్రపాలనగరం మార్గాన్ని బీటీ రహదారిగా అభివృద్ధి చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ ఫలితం కనిపించలేదని పేర్కొన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకుని, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బీటీ రోడ్ల నిర్మాణానికి వెంటనే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సిరిపురం గ్రామం వ్యవసాయంతో పాటు చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినదని, రహదారులు అభివృద్ధి చెందితే గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ మరింత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట టీడీపీ మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, పట్టణ అధ్యక్షుడు దిండిగల రాములు, మాజీ గ్రామపంచాయతీ సభ్యుడు సాయిని శేఖర్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురానికి బీటీ రోడ్లు నిర్మించాలి. పెద్దకాపర్తి, వెలిమినేడు మార్గాల అభివృద్ధికి రాపోలు నరసింహా విజ్ఞప్తి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News