Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

సీసీ రోడ్డు హామీని నెరవేర్చాలి-​మోడల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలి: ఎస్ఎఫ్ఐ

03-08-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుండి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది.​ ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రెండుసార్లు పాఠశాలను సందర్శించినప్పటికీ రహదారి పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారి విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందన్నారు. ​అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను ప్రారంభించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరిగి వరుణ్ తేజ్, పోలేపల్లి మల్లేష్, సర్వే అరవింద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీసీ రోడ్డు హామీని నెరవేర్చాలి-​మోడల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలి: ఎస్ఎఫ్ఐ

Article Image

చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుండి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది.​ ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రెండుసార్లు పాఠశాలను సందర్శించినప్పటికీ రహదారి పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారి విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందన్నారు. ​అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను ప్రారంభించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరిగి వరుణ్ తేజ్, పోలేపల్లి మల్లేష్, సర్వే అరవింద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News