Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు

03-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆగస్టు 10 ‘జైల్ భరో’ను విజయవంతం చేయాలి

కక్కిరేణి, ఆగస్టు 3 (ప్రతినిధి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు పిలుపునిచ్చారు.

సోమవారం కక్కిరేణి గ్రామంలో కార్మికులతో కలిసి జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజలకు పోరాట స్ఫూర్తి, ఐక్యతను చాటిచెప్పిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా, వర్గ సంఘాల నాయకులు కన్నెబోయిన యాదయ్య, వేముల సైదులు, గ్రామ కార్మికులు బడే సత్తయ్య, కోట వెంకన్న, కిన్నెర రమేష్, కట్ట భిక్షం, నర్సింహ, యశోద తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News