Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

చివరి నిమిషంలో గ్రామసభ రద్దు.. పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తుల నిరసన

03-08-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని దెగులవాడి గ్రామంలో సోమవారం జరగాల్సిన గ్రామసభ చివరి నిమిషంలో వాయిదా పడటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభను ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని పంచాయతీ సెక్రెటరీ ముందుగానే వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామంలో దండోరా కూడా వేయించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సర్పంచ్ పద్మావతికి జ్వరం రావడంతో గ్రామసభను వాయిదా వేసినట్లు పంచాయతీ సెక్రెటరీ ప్రకటించారు. దీంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజలను కార్యాలయానికి రప్పించి, అనంతరం సభ వాయిదా పడిందని చెప్పడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామసభ వాయిదా విషయాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉండేదని, ప్రజల సమయాన్ని వృథా చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామసభకు కొత్త తేదీని త్వరగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Sthanikam

చివరి నిమిషంలో గ్రామసభ రద్దు.. పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తుల నిరసన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని దెగులవాడి గ్రామంలో సోమవారం జరగాల్సిన గ్రామసభ చివరి నిమిషంలో వాయిదా పడటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభను ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని పంచాయతీ సెక్రెటరీ ముందుగానే వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామంలో దండోరా కూడా వేయించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సర్పంచ్ పద్మావతికి జ్వరం రావడంతో గ్రామసభను వాయిదా వేసినట్లు పంచాయతీ సెక్రెటరీ ప్రకటించారు. దీంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజలను కార్యాలయానికి రప్పించి, అనంతరం సభ వాయిదా పడిందని చెప్పడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామసభ వాయిదా విషయాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉండేదని, ప్రజల సమయాన్ని వృథా చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామసభకు కొత్త తేదీని త్వరగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News