Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:06 PM

రాసాల వెంకటేష్ స్తూపావిష్కరణకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈనెల 6న బస్వాపురంలో బహిరంగ సభ.. రైతులు, కార్మికులు భారీగా పాల్గొనాలని పిలుపు

03-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి, బస్వాపురం మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈనెల 6న బస్వాపురం గ్రామంలో నిర్మించిన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.

సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ అధ్యక్షతన జరిగిన సీపీఎం భువనగిరి మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కామ్రేడ్ రాసాల వెంకటేష్ జీవితాంతం ఎర్రజెండా నాయకత్వంలో పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని, గ్రామ సర్పంచిగా బస్వాపురం అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, రైతులకు మార్కెట్ సౌకర్యాల కల్పన వంటి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగించారని తెలిపారు.

ప్రజా ఉద్యమాలకు అంకితమైన నాయకుడి ఆశయాలను చిరస్థాయిగా నిలిపేందుకు గ్రామంలో స్మారక స్థూపాన్ని నిర్మించామని, ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థూపావిష్కరణతో పాటు బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. మండల వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వృత్తిదారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాసాల వెంకటేష్ స్తూపావిష్కరణకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈనెల 6న బస్వాపురంలో బహిరంగ సభ.. రైతులు, కార్మికులు భారీగా పాల్గొనాలని పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News