Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.

03-08-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె. చాంద్ అన్నారు. బాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో గంధమల్ల బాలయ్య విశేషంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, గత మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఉద్యమకారులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య అకాల మరణం ఉద్యమకారులందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, గంధమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.

Article Image

రామన్నపేట,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె. చాంద్ అన్నారు. బాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో గంధమల్ల బాలయ్య విశేషంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, గత మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఉద్యమకారులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య అకాల మరణం ఉద్యమకారులందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, గంధమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News