Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు

03-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, ఆగస్టు 3 (ప్రతినిధి):

ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు.

సోమవారం భువనగిరిలో మున్సిపల్ కార్మికులు, వివిధ రంగాల కార్మికులు, స్కీమ్ వర్కర్లను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భువనగిరిలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలకు అఖిల భారత, రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను బలహీనపరిచిందని మాయ కృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

జీవో ఎంఎస్ నెం.6లో ఉన్న లోపాలను సవరించి, శాస్త్రీయంగా కనీస వేతనాలను పునర్నిర్ణయించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.

భువనగిరిలో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశాల విజయవంతానికి కార్మికులు, ప్రజలు తమ వంతు ఆర్థిక, నైతిక సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సల్ల రాజయ్య, పాకాల శోభ, గంగారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News