Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి

గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి

గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి
04-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​లక్క పురుగుల ముప్పు నుంచి ప్రజలను కాపాడాలి

కలెక్టర్‌కు చౌటుప్పల్ 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి వినతి

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని త్వరితగతిన ఖాళీ చేసి, స్థానిక నివాసితులను లక్క పురుగుల తీవ్రత నుంచి రక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి- సాయిలు కోరారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

​గత కొంతకాలంగా వ్యవసాయ మార్కెట్ గోదాంలో భారీగా వరి ధాన్యం నిల్వ ఉండటంతో లక్క పురుగులు విపరీతంగా వ్యాపిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమీప వార్డుల ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ పురుగుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, ధాన్యాన్ని వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని, మార్కెట్ ఆవరణలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News