Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

భువనగిరి వినాయక చౌరస్తాలో 72 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి...

04-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారిని100 అడుగుల వెడల్పుతో

40 ఫీట్ల రోడ్డుతో చౌరస్తా మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి...

- జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత...

భువనగిరి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భువనగిరి పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.29 కోట్ల నిధులను మంజూరు చేసి,అంబేద్కర్ చౌరస్తా వద్ద మధ్యలో 72 అడుగుల వైశాల్యంలో ఆధునిక జంక్షన్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసిందని గుర్తు చేశారు. గతంలో 40 అడుగుల వెడల్పు ఉన్న హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారిని100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేసిన నేపథ్యంలో, అంబేద్కర్ చౌరస్తాను పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రణాళిక ప్రకారం వాటర్ ఫౌంటెన్,ఆధునిక లైటింగ్, సుందరీకరణ,గార్డెనింగ్‌తో పాటు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ,సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా నిర్మాణంలో మిగిలి ఉన్న స్ట్రామ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేసి, ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబేద్కర్ జంక్షన్‌ను నిర్మించడంతో పాటు,చౌరస్తా నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీవీఎంసీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, అంబేద్కర్-జగ్జీవన్ ఆశయ సాధన కమిటీ నాయకుడు బర్రె సుదర్శన్,బండారు రవివర్ధన్,ఇటుకల దేవేందర్,సురుపంగా చందు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి వినాయక చౌరస్తాలో 72 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News