చీపురుపల్లి: పిఎ పెత్తనం పచ్చ తమ్ముళ్ళు గుస గుస. పిఏ గారు మొర వినండి,మా బాధలు తొలగించండి - చీపురుపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు ఆవేదన.
చీపురుపల్లి: పిఎ పెత్తనం పచ్చ తమ్ముళ్ళు గుస గుస. పిఏ గారు మొర వినండి,మా బాధలు తొలగించండి - చీపురుపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు ఆవేదన.
Sr.Journalist YVN
సామాన్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కొంతమంది ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి ముందు మొరపెట్టనున్నారు.రాష్ట్రంలో ఎక్కడైనా ఎమ్మెల్యే గారి పిఏ అనే పదం వాడుక భాషలో వాస్తవంగా జరుగుతుంది.ప్రత్యేకించి చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి పిఏ గారి ఎమ్మెల్యే అంటూ పలు రాజకీయ పార్టీ నేతలే ఎమ్మెల్యే పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు వద్దకు సామాన్యులు చేరుకొని సమస్యలు చెప్పుకోవాలంటే పిఏ గారిని దాటుకొని వెళ్లాలంటూ పలువురా పార్టీ నేతలే పార్టీ పనితీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బిరుదును ప్రస్తుత ఎమ్మెల్యే పిఏ గారికి వర్తిస్తుందంటూ పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తుందంటూ పలువురు ఆరోపణ చేస్తున్నప్పటికీ చీపురుపల్లి నియోజకవర్గం ప్రధాన కేంద్రానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిమిడి కళా వెంకట్రావు తన ప్రత్యర్థి బొత్స సత్యనారాయణ మీద గెలుపొంది రాష్ట్రవ్యాప్త చరిత్ర సృష్టించినప్పటికీ పిఏ కారణంగా అభాసపాలవుతున్నారంటూ పలు రా పార్టీ నాయకులే ఈ నెల 28న చీపురుపల్లి మండలం రాయవలస పంచాయతీ పరిధిలోని పైలపేట గ్రామంలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళుతున్నట్లు పలు రచ్చరిస్తున్నారు. శాసన సభ్యులుగా కిమిడి కళా వెంకట్రావు గెలిపించినప్పటికీ, ఆయన కుమారుడు కిమిడి మల్లిక్ నాయుడు సైతం అరకొర నాయకులతో తప్ప ప్రజలతో మమేకం కాకపోవడం వలన సమస్యలను చెప్పుకోవడానికి కూడా వెనుకంచి వేస్తున్నట్లు పలు గ్రామాల ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కిమిడి కళా వెంకట్రావు తర్వాత వారసత్వ రాజకీయాల్లో తన కుమారుడిని కిమిడి మల్లిక్ నాయుడుని రాజకీయాల్లోకి దింపినప్పటికీ ఆయనకు ఎటువంటి ప్రజాధరణ లేదని, భవిష్యత్తు రాజకీయాలకు ఆయన పనికిరాడు అంటూ పలువురు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన కిమిడి మృణాలని తనయుడు కిమిడి నాగార్జున ప్రస్తుత డిసిసిబి చైర్మన్గా పనిచేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో దేశం పార్టీలోని వర్గపోరుతో నాగార్జున వైపు మక్కువ చూపుతున్నట్లు పలువురు బహిరంగంగా ముచ్చటించుకుంటున్నారు.రాష్ట్ర మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పనిచేసిన ప్రతిపక్ష నేతగా గుర్తింపు కలిగిన మంత్రి బొత్స సత్యనారాయణకు రానున్న స్థానిక ఎన్నికలతో పాటు,సాధారణ ఎన్నికల్లో కూడా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే చీపురుపల్లి మండలంలోని ఈనెల 28న పార్టీ అధిష్టానం నిర్ణయించి చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ పలు విమర్శిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పర్యటించిన ప్రస్తుతం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రజా సమస్యల పట్ల కనీసం స్పందించకపోవడంతో రానున్న ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తుందంటూ పరువు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి భిన్నంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాస్తవమే అంటూ వత్తాసు పలకడం కోసమెరుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు తారుమూరు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చీపురుపల్లి లో జరిగిన ఎన్నికల పర్యటనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సైతం ఎందుకు అమలు కావటం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. చీపురుపల్లి ఆర్ఇసిఎస్ ను పునరుద్ధరణ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను స్థానిక శాసనసభ్యులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విస్మరించారని పలువురు విమర్శిస్తున్నారు. అదేవిధంగా చీపురుపల్లిలోని ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని 100 పడకుల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామంటూ నాటి పాలకులు, ప్రస్తుత పాలకులు ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పరిపాలనలో నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కేడర్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తుల కారణంగా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా నిలిచిన పరిస్థితి రానున్న రోజుల్లో అస్తవ్యస్తం కాగలదంటూ పలువురు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా చీపురుపల్లిలో జరుగుతున్న పార్టీ దీన, హీనస్థితి పరిస్థితిలను పరిశీలించి నియోజకవర్గ నాయకులకు దిశా దశ నిర్ధించాలంటూ పలువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పరువు పరిశ్రమలు మూతపడినప్పటికీ ఉపాధి కోల్పోతున్న కార్మికుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిసారించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి