Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:24 AM

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత ఫైర్

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత ఫైర్

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత ఫైర్
09-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ/శ్రీసత్యసాయి: వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు జరిగాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత విమర్శించారు. మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి లేదని మండిపడ్డారు.

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి అండగా నిలుస్తోందన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా మహిళల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.

ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు కృషి చేశారని గుర్తుచేశారు.

తల్లిని, చెల్లిని గౌరవించని జగన్

శాసనసభలో తల్లిలాంటి నారా భువనేశ్వరిను అవమానించిన ఘటనను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. సొంత తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని విమర్శించారు. మహిళలను అవమానించే చరిత్ర వైసీపీకి ఉందని అన్నారు. అమరావతి మహిళలపై కేసులు పెట్టి వేధించిన ఘటనలను ప్రజలు మరిచిపోలేదన్నారు.

రాయలసీమకు అన్యాయం

రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అయిదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, చెరువులను కూడా నింపలేకపోయారని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాయలసీమను హార్టికల్చర్, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

స్థానికంగా పరిశ్రమలు ఏర్పడడంతో యువత ఉపాధి కోసం వలసలు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు పొందుతున్నారని, దీనితో రాయలసీమ తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు.

Sthanikam

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత ఫైర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News