Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:25 AM

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు

12-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రతి మనిషి గుండెల్లో దివంగత నాయకుడు వైయస్. రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన తరువాత యావత్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైయస్.జగన్మోహన్ రెడ్డి ను ఆరాధిస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

స్థానిక వైఎస్సార్ విగ్రహానికి కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, నారాయణరెడ్డి, లక్ష్మీనరసప్ప సమక్షంలో దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ప్రతి ఇంటిలో జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత శక్తివంతమైన పార్టీగా అవతరిస్తుందని అన్నారు.

అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో చాలాకూరు లక్ష్మీనరసప్ప, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, ముద్దాపుకుంట కిష్టప్ప, కంబాలప్ప, ఆదినారాయణరెడ్డి, యూత్ నాయకుడు నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు, పట్టణ ఉపాధ్యక్షుడు మాదన మంజు, వార్డు మెంబర్లు లక్ష్మీరెడ్డి, గాజుల శ్రీకాంత్, జరి రామాంజి, మహిళా నాయకురాళ్లు గాజుల మణెమ్మతో పాటు అమర్, మహేష్, బొంబాయి బాబు, మాజీ డీలర్ బాబు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News