Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:46 AM

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

03-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం కేంద్రంలోని ఎంక్విఏ గ్లోబల్ ట్రస్ట్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని పెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పర్యవేక్షకులు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పెనుకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి చెప్పాలా, మండలాల కన్వీనర్లు జభీ, సురేష్, సంతోష్, మహేష్, అలాగే నాయకులు నాగరాజ్, శ్రీనివాసులు, వరలక్ష్మి, మంజు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News