Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:39 AM

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

06-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

ఆరు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు… అన్నదానం నిర్వహణ

రాయికోడ్ (అందోల్),

జిల్లాలోని పురాతన శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రాయికోడ్ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఆరు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో భాగంగా 6న ధ్వజారోహణం, శిఖరపూజ, భద్రకాళీ కుంకుమార్చన, వీరభద్ర స్వామి అభిషేకం, బసవేశ్వర అభిషేకం నిర్వహించారు.7న మహారుద్రాభిషేకం, పల్లకిసేవ, అగ్నిగుండం, గణపతి హోమం, స్వామివారి కల్యాణం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి భజన కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బీచ్కుందకు చెందిన సోమలింగ శివాచార్యులచే తీర్థప్రసాదాల పంపిణీ, పెద్దిరాజు పెద్దమ్మ నాటక ప్రదర్శనలు జరుగనున్నాయి.8, 9 తేదీల్లో సహస్ర బిల్వార్చన, కుంకుమార్చన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10న ఆకుల పూజ, దంపతుల పూజ, 11న స్వామివారికి అభిషేకాలు నిర్వహించి జాతర ఉత్సవాలు ముగించనున్నారు.జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.న్యాల్కల్ (జహీరాబాద్):

మండల పరిధిలోని మేరియంపూర్ సమీపంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో నేటినుంచి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Sthanikam

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News