Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:41 AM

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

21-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.

ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.

మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.

Sthanikam

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

Article Image

సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.

ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.

మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News