Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

వేద పండితుల కృషిని తక్కువ అంచనా వేయొద్దు: అవగాహన అవసరం

02-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేద విద్యాభ్యాసం కఠిన సాధనతో కూడుకున్నది.

పురోహితుల శ్రమను గుర్తించాలని పిలుపు

సమాజంలో కొంతమంది పురోహితులు, వేద పండితుల సేవలను తక్కువగా అంచనా వేస్తూ "నాలుగు మంత్రాలు చదివి దక్షిణ తీసుకెళ్లారు" అనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పలువురు వేదాభిమానులు పేర్కొంటున్నారు.

వేద పండితుడిగా ఎదగడానికి చిన్న వయసు నుంచే కఠినమైన శిక్షణ అవసరమని వారు తెలిపారు. సుమారు తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచే ఆశ్రమాల్లో చేరి ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి వేద పఠనం, సంస్కృత విద్యను అభ్యసించాల్సి ఉంటుందని వివరించారు. కుటుంబ సభ్యులకు, పండుగలు, వేడుకలకు దూరంగా ఉంటూ ఎన్నో సంవత్సరాలు నియమనిష్ఠలతో విద్యను అభ్యసిస్తారని తెలిపారు.

వేద మంత్రాలను శుద్ధంగా ఉచ్చరించడం, వాటి అర్థాన్ని గ్రహించడం సాధారణ విషయం కాదని, దీని వెనుక ఎన్నో సంవత్సరాల సాధన ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో కేవలం వృత్తిగా మాత్రమే నిర్వహించే వారిని, సంప్రదాయ పద్ధతిలో కఠోర శ్రమతో విద్యను అభ్యసించిన వేద పండితులను ఒకేలా చూడకూడదని సూచించారు.

కులం లేదా రాజకీయ కోణంలో సనాతన ధర్మంపై విమర్శలు చేయకుండా, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరారు. వేద పాఠశాలల్లో వేద విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న వారికి అవకాశం ఉంటుందని, అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Sthanikam

వేద పండితుల కృషిని తక్కువ అంచనా వేయొద్దు: అవగాహన అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News