Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:24 AM

న్యాల్కల్ రామలింగేశ్వర ఆలయంలో చంద్రగ్రహణ భజన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

03-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా:

చంద్రగ్రహణం సందర్భంగా న్యాల్కల్ గ్రామంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రహణ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. తాళాలు, వాద్యాల నాదంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

తబలా మాస్టర్ హనుమంతు, రామచందర్ పవర్, బక్కారెడ్డి, జక్కుల శ్రీనివాస్, నరసింహారెడ్డి పటేల్, బోడపల్లి శ్రీశైలం, గద నారాయణ, మెడికల్ అశోక్, ప్రభా రెడ్డి తదితరులు భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం స్వయంభూ లింగాకారంతో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం రోజున భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా నిర్వహించిన ఈ భజన కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిందని భక్తులు తెలిపారు.

Sthanikam

న్యాల్కల్ రామలింగేశ్వర ఆలయంలో చంద్రగ్రహణ భజన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Article Image

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా:

చంద్రగ్రహణం సందర్భంగా న్యాల్కల్ గ్రామంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రహణ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. తాళాలు, వాద్యాల నాదంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

తబలా మాస్టర్ హనుమంతు, రామచందర్ పవర్, బక్కారెడ్డి, జక్కుల శ్రీనివాస్, నరసింహారెడ్డి పటేల్, బోడపల్లి శ్రీశైలం, గద నారాయణ, మెడికల్ అశోక్, ప్రభా రెడ్డి తదితరులు భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం స్వయంభూ లింగాకారంతో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం రోజున భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా నిర్వహించిన ఈ భజన కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిందని భక్తులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News