Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

11-04-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామం నుండి బీదానిపల్లికి నూతనంగా వేస్తున్న తారు రోడ్డు పనులను ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిశీలించారు.

గతంలో కంబాలపల్లి మరియు బీదానిపల్లి గ్రామాల ప్రజలు సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా చౌకధాన్యపు డిపో నుండి బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో బీదానిపల్లి గ్రామస్తులు ఎన్నో కష్టాలు పడేవారు.

ఈ సమస్యలను గుర్తించిన కంబాలపల్లి గ్రామ సర్పంచ్ మంజునాథ్, సుమారు 20 రోజుల క్రితం రొద్దం మండలం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వివరించారు.

దీనికి వెంటనే స్పందించిన మంత్రి సవితమ్మ సుమారు మూడు కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండగా, సర్పంచ్ మంజునాథ్ మరియు స్థానిక నాయకులతో కలిసి యువ నాయకులు పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా బీదానిపల్లి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించిన మంత్రి సవితమ్మ గారికి, మండల నాయకులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News