Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:41 AM

5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

26-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపూర్ పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సభలో సెన్సస్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు.ఈ 5K రన్ గాంధీ సర్కిల్ నుండి ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగిసింది.ప్రజలందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించే భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులకు ఈ గణాంకాలే మూలాధారమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి దశలో ప్రతి ఇల్లు, వీధి మరియు గ్రామ పరిధిలోని గృహాల వివరాలను నమోదు చేస్తున్నారు.2027 ఫిబ్రవరిలో జరిగే పాపులేషన్ సెన్సస్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు మరియు కుల గణన చేపట్టడం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సెన్సస్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.రాబోయే 'జనాభా గణన 2027' అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జనాభా గణన ప్రాముఖ్యతను వివరించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు జనాభా గణనపై వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విజేతలుగా ఎంపిక చేయడం జరిగింది.విజేతలకు ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన పెంచడం విశేషం అని కలెక్టర్ పెర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, బాలాజీ,హిందూపూర్ మున్సిపల్ కమిషనర్మల్లికార్జున,ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిఎస్పి మహేష్,తహశీల్దార్ వెంకటేశు,మడకశిర తహసీల్దార్ మైనుద్దీన్, మరియు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News