Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

18-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు,రేనాటి వీరుడు, బహుజన పోరాట యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఓడిసి మండల కేంద్రంలోని హైవే కూడలిలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఓడిసి మండల వడ్డెర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా వడ్డెర కులస్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది వేముల బేబీరాణి, తదితర ప్రముఖులు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాటంలో గిరిల్ల యుద్ధ తంత్రంతో బ్రిటిష్ సైన్యాన్ని తుద ముట్టించిన పోరాటయోధుడని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఓబన్న చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వడ్డెర కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు. అనంతరం సభలో టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప ప్రసంగించారు. వడ్డే ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబన్న విగ్రహ దాత డేరంగుల రవీంద్ర, మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ, రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శులు ఎల్ఐసి నరసింహులు, దేవుళ్ళ మురళి, సామకోటి ఆదినారాయణ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, జిల్లా వడ్డెర సాధికారిత కన్వీనర్ పల్లపు రవీంద్ర, పల్లపు జయచంద్ర, మల్లెల జయరాం, ఓసిసిసిఐ జాతీయ అధ్యక్షులు గొడ్డువెలగల వెంకటేష్, డిఎస్పీ వేణుగోపాల్, టీడీపి జిల్లా అధికార ప్రతినిధి సోమశేఖర్, వైసిపి రాష్ట్ర నాయకులు రేపన ముని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మస్తానమ్మ, అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News