నల్లగొండ: దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, అమరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 15 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు.
వారి త్యాగాలు పోలీస్ శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి