Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

హైవే తవ్వేశారు సరే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి?

Updated : 20 Oct 2026 17:05 IST
As Preferred Source 1 min read
హైవే తవ్వేశారు సరే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి?

​​హైవే పనులతో వాహనదారులు, పాదచారుల తీవ్ర అవస్థలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

​హైవే విస్తరణ, మరమ్మతు పనుల పేరుతో అధికారులు, గుత్తేదారులు ప్రధాన రహదారిని తవ్వేసి అరకొర పనులతో వదిలేశారు. అభివృద్ధి పనులు చేపడితే సంతోషమే అయినా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం పూర్తిగా విస్మరించడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ​పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నా, కనీసం సర్వీస్ రోడ్లు సరిగా నిర్వహించకపోవడం, తాత్కాలిక దారులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రద్దీ వేళల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. రాత్రి వేళల్లో తవ్విన గుంతల వద్ద కనీసం రేడియం హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, ప్రాపర్ లైటింగ్ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతల మయంగా మారిన రోడ్లలో ద్విచక్ర వాహనదారులు కిందపడి తీవ్ర గాయాల పాలవుతున్నారు.రోడ్డు పక్కన కనీసం నడవడానికి వీలు లేకుండా మట్టి కుప్పలు, రాళ్లను వేయడంతో కాలినడకన వెళ్లే వృద్ధులు, పాఠశాల విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక షాపుల యజమానులు, నివాసితులు ధూళి, దుమ్ము కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. "పనులు చేయడం సరే.. మరి ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎవి? కనీసం దుమ్ము లేవకుండా రోజూ నీళ్లు చల్లడం లేదు. అధికారులు స్పందించి వెంటనే తాత్కాలిక ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలి, హెచ్చరిక బోర్డులు పెట్టాలి" అని వాహనదారులు, చెరుకు శివ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

హైవే తవ్వేశారు సరే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి