నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్ దుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి ఈ నెల 22వ తేదీ ఉదయం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర సమితి అధ్యక్షుడు మెండే సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు షెట్కార్ ఈదెప్ప, సహాయకులు చెన్ బసప్ప, మైపతి ఆధ్వర్యంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రలో 125 మంది భక్తులు పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్రలో భక్తులకు మార్గమధ్యంలో అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. భక్తులందరూ అమ్మవారి నామస్మరణతో పాదయాత్రలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తుల్జాపూర్ అమ్మవారి సేవలో కంగ్టి భక్తులు.. 125 మందితో పాదయాత్ర
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి