చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. పార్టీ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన పగిళ్ల యాదయ్య, కార్యదర్శిగా ఎన్నికైన గోలి నరేష్ రజక్‌లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రజక సంఘం ఉపాధ్యక్షుడు గోలి గణేష్‌తో పాటు సంఘం నాయకులు నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఎలకరాజు ఆంజనేయులు, గోలి మల్లేష్, గోలి నరసింహ, గోలి మహేష్, గోలి గణేష్, గోలి హరీష్, గోలి సాయికిరణ్, గోలి ప్రసాద్, గోలి మచ్చగిరి, గ్రామస్తులు ఆరూరి రాజు, చిరగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి