Sthanikam - Truth Matters
Logo

పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుకు ఘన సన్మానం

Updated : 19 Oct 2026 21:58 IST
As Preferred Source 1 min read
పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుకు ఘన సన్మానం


వెలిమినేడు రజక సంఘం నాయకుల అభినందనలు.


చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పీఆర్‌టీయూ (టీఎస్‌) నాయకుడు ఎలుకరాజు ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వెలిమినేడు రజక సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

విద్యా రంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. నూతన బాధ్యతల్లో ఆంజనేయులు మరింత సమర్థవంతంగా పనిచేసి ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గోలి నరసింహ, గోలి గణేష్, గోలి మహేష్, గోలి నరేష్, గోలి నరేష్ రజక, గోలి సాయికిరణ్, గోలి ప్రసాద్, గోలి మచ్చగిరి, గ్రామానికి చెందిన ఆరూరి రాజు, చిరగొని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుకు ఘన సన్మానం

Article Image


వెలిమినేడు రజక సంఘం నాయకుల అభినందనలు.


చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పీఆర్‌టీయూ (టీఎస్‌) నాయకుడు ఎలుకరాజు ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వెలిమినేడు రజక సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

విద్యా రంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. నూతన బాధ్యతల్లో ఆంజనేయులు మరింత సమర్థవంతంగా పనిచేసి ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గోలి నరసింహ, గోలి గణేష్, గోలి మహేష్, గోలి నరేష్, గోలి నరేష్ రజక, గోలి సాయికిరణ్, గోలి ప్రసాద్, గోలి మచ్చగిరి, గ్రామానికి చెందిన ఆరూరి రాజు, చిరగొని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి