మహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం
శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని ప్రసిద్ధ శ్రీ సోమనాథ క్షేత్రంలో వేడుకలు కన్నులపండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ చండీ హోమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తుల కోసం భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. నవరాత్రుల అమ్మవారికి అలంకరించి పూజలు నిర్వహించిన ప్రత్యేక చీరలను, లడ్డూలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేలం పాటలో దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర కమిటీ అధ్యక్షుడు బడుగు నరసింహ మాట్లాడుతూ.. సోమనాథ తత్వాన్ని భక్తులకు వివరించారు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం భక్తులు మనోయోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బడుగు మాణిక్యం, క్షేత్ర కమిటీ గౌరవాధ్యక్షుడు అప్పిడి రామిరెడ్డి, కార్యదర్శి గట్టు ప్రభాకర్, రవీందర్, డాక్టర్ వేముల నరసింహ యమునా, కృష్ణమాచారి, గణేష్, భాస్కర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి