సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన.. రాయితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలిక జాస్మిన్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆడుకుంటున్న చిన్నారిపై తల్లి సైరాబాను రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటున్న సైరాబాను తన కుమార్తెతో కలిసి బంధువుల ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. సైరాబానుకు మానసిక సమస్యలు ఉన్నట్లు బంధువులు వెల్లడించినట్లు తెలిసింది. బాలిక మృతిపై ఆమె మేనమామ ఫిర్యాదు చేయడంతో కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
కన్నతల్లి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి