తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం దోసపల్లి గ్రామంలో మహిళలు ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ప్రత్యేకంగా అలంకరించారు.గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మానూర్ మండల అధ్యక్షుడు బిరాదర్ దత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మానూర్ ఎస్సై కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మలను పరిశీలించారు.అనంతరం ఉత్తమంగా బతుకమ్మలను తయారు చేసిన ఐదుగురు మహిళలను ఎంపిక చేసి, సర్పంచ్ బిరాదర్ దత్తు సహకారంతో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
దోసపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి