సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలు, పోలీస్ వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ,విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ప్రజలు అభివృద్ధి సాధించి విజయపథంలో ముందుకు సాగాలని కోరారు.ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని,శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, అత్యవసర సమయాల్లో సత్వర సేవలు అందించడంలో పోలీస్ ఆయుధాలు,వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ,ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని డీఎస్పీ వెంకట్ రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయదశమి సందర్భంగా పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి