కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు గోలి నరేష్ రజక పిలుపు.
చిట్యాల: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి గోలి నరేష్ రజక పిలుపునిచ్చారు. సోమవారం (అక్టోబర్ 19) నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి నకిరేకల్ నియోజకవర్గంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోలి నరేష్ రజక విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి