కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డులో రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువైన దుర్గా మాత మండపం వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకల్లో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ కాలనీ మహిళలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలు పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, చుట్టూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని, దుర్గా మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి